ప్రిన్స్ మహేష్ బాబు మరో రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ హీరోగా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దీపావళి కానుకగా ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ఓ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బుల్లెట్ మీద మహేష్ స్టైల్ గా వస్తున్న ఫోటో మహేష్ అభిమానులతో పాటు సినీఅభిమానులను సైతం ఆకట్టుకుంది. టాలీవుడ్ చరిత్రలో ఒక పోస్టర్ కి 69000 లైక్ రావటం ఇదే మొదటి సారి అంటున్నారు సినీ విశ్లేషకులు. పోస్టర్ తో రికార్డులు తిరగరాస్తున్న మహేష్ సినిమాతో కూడా అంతే రికార్డులు బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలో 13ఏళ్ల తర్వాత రాములమ్మ మళ్లీ నటిస్తుండటం విశేషం.