ప్రిన్స్ మహేష్ బాబుకు గారాల కూతురు సితార అంటే ఎంతో ఇష్టం. కుమార్తెల దినోత్సవం సందర్భంగా ముద్దుల పాపకు శుభాకాంక్షలు తెలిపారు. ‘డాటర్స్ డే’ స్పెషల్ వీడియోను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సితారను ముద్దు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సితారతో ఆప్యాయంగా దిగిన ఫొటోలతో ఒక వీడియోను రూపొందించారు.
‘నా బుజ్జి సితార పాపా నీకు ‘డాటర్స్ డే’ శుభాకాంక్షలు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుమార్తెవు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.’ అని మహేష్ ట్వీట్ ఇచ్చారు.
సితార తల్లి నమ్రత కూడా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా స్పెషల్ వీడియోను షేర్ చేశారు. సితారకు ప్రత్యేకంగా ‘డాటర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు.
‘నా జీవితంలో వెలుగు దివ్వెవు నువ్వు. నా ఆకాశంలో ప్రతిక్షణం మెరుస్తుండే చిన్ని తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు. లవ్ యూ సితార.’ అని నమ్రత ప్రేమాభిమానాలు చూపారు.