మేడ్చల్ జిల్లా మేడిపల్లి లో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధుల పై దాడులకు నిరసనగా మీడియా ప్రతినిధులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ తో పాటు కొందరు ప్రజా ప్రతినిధుల భర్తలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది.
దీంతో దానిని కవర్ చేయడం కోసం కొందరు మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆ క్రమంలో కొందరు బీఆర్ ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడులకు నిరసనగా మేడిపల్లి ముందు ధర్నా నిర్వహించి దాడికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడిపల్లి సీఐ గోవర్థనగిరికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండలం ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంకూరి మురళి, ప్రధాన కార్యదర్శి కల్కూరి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రవి, బీజేపీ అధ్యక్షుడు అనిల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.