కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు.. యేడాది పాటు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు సిద్ధూకు ఖైదీ నెంబర్ 241383 గా కేటాయించారు. అనంతరం పాటియాలా జైలు బ్యారక్ నెంబర్ 7 గల గదిలోకి పంపారు. దీంతో ఆయనకు మొదటి రోజు జైలులో గడిచిపోయింది.
జైలులో సిద్ధూకు ఓ టెబుల్, రెండు టర్బన్లు, ఓ కప్‌బోర్డు, బ్లాంకెట్, రెండు టవల్స్, దోమ తెర, ఓ పెన్ను, నోట్‌బుక్, షూలు, రెండు బెడ్‌షీట్స్, నాలుగు జతల కుర్తా పైజామా ఇచ్చారు అధికారులు. అయితే సిద్దూ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు జైలు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో మాతా కౌసల్య ఆస్పత్రికి పోలీసులు తీసుకెళ్లారు.
పరిక్షలు చేసిన అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు పోలీసులు అధికారులు వెల్లడించారు. 1988లో పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ పై సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు దాడికి దిగడం.. అనంతరం గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఈ కేసులోనే సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.
మొదటి రోజు రాత్రి సిద్ధూ జైలులో ఇచ్చిన ఆహారాన్ని తీసుకోకుండా ఫాస్టింగ్ ఉన్నారు. ఖైదీలు అందరికీ ఒకటే ఆహారం ఇస్తారు. ఒకవేళ వైద్యులు సూచిస్తే జైలు క్యాంటిన్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేసుకోవడం లేదంటే స్వయంగా వండుకోవడానికి అనుమతిస్తారు.