కేసీఆర్‌ ఆదర్శంగా కంపెనీలు జీతాలు ఎగ్గొడితే...? - Tolivelugu

కేసీఆర్‌ ఆదర్శంగా కంపెనీలు జీతాలు ఎగ్గొడితే…?

kcr is ideal for those who private companies and organizations not giving salaries, కేసీఆర్‌ ఆదర్శంగా కంపెనీలు జీతాలు ఎగ్గొడితే…?

పని చేయించుకొని జీతాలు ఎగ్గొట్టే సంస్థలకు, కంపెనీలకు, వ్యక్తులకు ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదర్శం అంటున్నారు కొందరు. అంతే కాదు కోర్టులు జీతాలు చెల్లించాలని చెప్పినా వినాల్సిన పనిలేదని కూడా కేసీఅర్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ నెల ఆర్టీసీ కార్మికులు పనిచేశారు కానీ వారికి సంస్థ జీతాలు ఇవ్వలేదు. అందేమంటే మీరు సమ్మెకు వెళ్లారు అంటున్నారు.

మేము పనిచేసిన నెలకు జీతాలు ఇవ్వండి, సమ్మె కాలానికి కాదు అని చెప్పిన ససేమిరా అంటున్నారు. దీనిపై కార్మికులు హైకోర్టు కు వెళ్లారు. కోర్టు సైతం జీతాలు చెల్లించాలని చెప్పింది కానీ ప్రభుత్వం మాదగ్గర డబ్బులు లేవు అంటూ చేతులు ఎత్తేసింది. జీతాలు ఇవ్వాలంటే నాలుగు బస్టాండ్ లు అమ్మాలి అంటూ సెటైర్స్ విసిరింది. ఈ విషయంలో కోర్టు కూడా ఏమీ చేయలేదు అంటూ వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు కూడా ఏమి చేయలేదు అని ముఖ్యమంత్రి అన్నట్లు పత్రికలో వార్తలు వచ్చాయని,ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి అని వారు పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే అనేక సంస్థలు, కంపెనీలు పని చేయించుకొని జీతాలు ఇవ్వక ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై కార్మికులు, ఉద్యోగులు లబోదిబోమంటూ అటు లేబర్ డిపార్ట్మెంట్‌నో, ఇటు కోర్టులనో, లేదంటే పోలీసులనో ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయమని కోరుతున్నారు. చాలా సందర్భాల్లో న్యాయం జరిగింది తక్కువే అనీ చెప్పాలి. ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు కూడా రెండు మూడు నెలల జీతాలు ఇవ్వకుండా తమ ఛానెల్స్ ను మూసివేసిన పరిస్థితులు కూడా చూశామని గుర్తు చేస్తున్నారు. ఆ సందర్భంగా అటు లేబర్ మినిస్టర్ ని ఇటు కోర్టులను ఆశ్రయించినా జీతాలు మాత్రం రాలేదు.

ఇప్పుడు స్వయంగా ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంత పెద్ద రోడ్డు రవాణా సంస్థే మేము కార్మికులకు జీతాలు ఇవ్వలేము అంటే దానికి ముఖ్యమంత్రి వత్తాసు పలికి, పైగా ఈ విషయంలో కోర్టులు కూడా ఏమి చేయలేవు అని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అందరికీ నాయ్యం చేయాల్సిన ముఖ్యమంత్రి ఎవరికైనా అన్యాయం చేస్తే శిక్షించాల్సిన వ్యక్తి ఇలా అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

పని చేయించుకొని జీతం ఇవ్వకపోగా ఎవరు ఏమి చేయలేరు అని చెప్పడం దారుణం అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని రేపటి నుండి అనేకమంది తాము పని చేయించుకున్న వారికి జీతాలు ఇవ్వకుండా ఎగొట్టి, అదేమంటే ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు, ఈ విషయంలో మాకు కేసీఆర్ ఆదర్శం అని చెప్పినా ఆశ్చర్య పడాల్సిన పనేమిలేదు అంటున్నారు. పాలకుడు ఇలాంటి మాటలు మాట్లాడి… ఇలాంటి విధానాలకు పాల్పడి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్న డో తెలియడం లేదు, బంగారు తెలంగాణ అంటే పని చేయించుకొని జీతాలు ఎగొట్టడమా నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని అంటున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp