హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న రాజ్ కుమార్ అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీకేగూడలో ఒక అద్దే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాజ్ కుమార్ తన స్నేహితుడికి కాల్ చేసి మనసు బాలేదని చెప్పాడు.
అయితే, కాసేపటి తరువాత స్నేహితుడు కాల్ చేసినా.. స్పందించకపోవడంతో ఆయన ఉంటున్న ఇంటికి వచ్చి చూసేసరికి చేతికి సలైన్ బాటిన్ పెట్టుకొని స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. సెలైన్ బాటిల్ లో విషం కలిపి ఎక్కించుకున్నాడని తెలిపారు. కాగా.. కడప జిల్లా బద్వేలుకు చెందిన రాజ్ కుమార్ గత కొంత కాలంగా అమీర్‌పేట శ్యామ్‌కరణ్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు.