కరోనా తో దేశం, తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. బయటపడే మార్గాన్ని ఆచరిస్తున్నారు. ఎవరికి వారు తమ వంతుగా, బాధ్యగా వ్యవహరిస్తున్నారు. కానీ కాసులకు కక్కుర్తి పడే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. జనాల రక్తం తాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ట్రీట్మెంట్ కోసం ఎమర్జెన్సీ గా వచ్చే కేసులను తీసుకోవట్లేదు.మావల్ల కాదు, మేము ట్రీట్మెంట్ చేయలేమని చేతులెత్తే స్తున్నాయి.
కేవలం కాళ్ళు, చేతులు విరిగిన కేసులు, గుండె జబ్బులు శ్వాసకు , జ్వరానికి సంబంధం లేని కేసులను మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. కనీసం తీవ్ర జ్వరం తో వచ్చినా పట్టించుకోవట్లేదు.శ్వాస సంబంధిత దీర్ఘ కాలిక వ్యాధుల పేషెంట్ లను అస్సలు పట్టించుకోవట్లేదు. దీనికి ప్రధాన కారణం కరోనా.
కరోనా అనుమానిత కేసు అని తేలితే, ట్రీట్మెంట్ చేసిన ఆసుపత్రి సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి , రిస్క్ చేయట్లేదని ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
పేషెంట్ బందువులు ఈ జబ్బు ముందు నుండి ఉన్నదే అని ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ లోకి ఎంట్రీ లేదంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ సంగతి మనకు తెలియంది కాదు. ఇప్పటికే కరోనా అనుమానిత కేసులతో గాంధీ నిండిపోయింది. మరి దీర్ఘ కాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే పేషెంట్ లకు ఇబ్బంది వస్టే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? ఇక వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైనా సీరియస్ అయితే ఊహించడానికి కష్టంగా ఉంది పరిస్థితి.
కొన్ని కేసుల విషయంలో అత్యంత కటినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఇన్సూరెన్స్ లు పనికిరావు, డబ్బులు కడితే ట్రీట్మెంట్ చేయడానికి రెడీ అని జనాల రక్తం తాగడానికి సిద్ధమవుతున్నాయి.
అందుకే ప్రభుత్వం, వైద్య అధికారులు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలను హెచ్చరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.