అవసరమా కాదా అన్న విషయం పక్కనబెడితే ఓ వ్యక్తి ఉపయోగించే వస్తువులను, ఉండే వసతిని బట్టి కొంతవరకూ వారివారి స్థాయిల తెలుసుకోవచ్చు. సైకిళ్ళు కూడా లేని రోజుల్లో, మోటర్ బైక్ ఉంటే గొప్ప, కారు ఉండడం ఓ రేంజ్.
మరిప్పుడు ..!మోటార్ బైకులు..కార్లు ఉండడం సర్వసాధారణం అయిపోయాయి. బ్రాండెడ్ కార్లను బట్టి వారివారి స్థాయిలను తెలుసుకోవడం అనేది కూడా స్థాయిని నిర్ణయించే పారామీటర్ కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం వారికున్న వాహనాల దృష్ట్యా హోదాను, స్థాయిని నిర్ణయించాలంటే సొంత జెట్ విమానాలు ఉండాల్సిందే..! ఈ పరిస్థితి కూడా రేపోరోజు సాధారణమైపోతుందేమో చెప్పలేం. టాలీవుడ్ లో సొంత జెట్లను ఉపయోగిస్తున్న శ్రీమంతులైన హీరోలు నలుగురే నలుగురు ఉన్నారు.ఆ హీరోలెవరో తెలుసుకుందాం.
1. చిరంజీవి:
చిరంజీవికి సొంతంగా ఒక జెట్ విమానం ఉంది . దీని కోసం రామ్ చరణ్ 80 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు సమాచారం! ఫ్యామిలీ టూర్లకు దీన్ని వినియోగిస్తారట!
2. ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ కి కూడా సొంతంగా ఒక జెట్ ఫ్లైట్ ఉందట! ఆ విమానాన్ని ఇటీవలే 80 కోట్లు పెట్టి కొన్నాడని తెలిసింది.
3. అల్లు అర్జున్:
అల్లు అర్జున్ పెళ్లి తర్వాత తమ కుటుంబం కోసం సొంతంగా జెట్ ఫ్లైట్ కొన్నట్టు సమాచారం!
4. నాగార్జున:
నాగార్జున కు కూడా సొంతంగా ఒక ఫ్లైట్ ఉందట. తాను కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళడానికి దీనిని వాడుతుంటాడు . రీసెంట్ గా వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్లి బిగ్ బాస్ కు రావడానికి తన ప్రైవేట్ జెట్ నే వాడేవారట!
ఈ జెట్ విమానాలను….తమకు దగ్గర్లోని ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసి ఉంచుతారు. అక్కడి సిబ్బంది దీని మెయింటేనెన్స్ చూసుకుంటారు. దానికి కోసం జెట్ విమానాల ఓనర్ల ఒప్పందం ప్రకారం వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీరి అనుమతి మేరకు అప్పుడప్పుడు వీటిని ఇతరులకు సైతం రెంట్ బేసిస్ లో ఇస్తుంటారు!