తెలంగాణలో ప్రైవేటు టీచర్లు, స్కూల్స్ యజమాన్యాలు రోడ్డెక్కుతున్నాయి. కరోనా కారణంగా భారీ నష్టాల్లో ఉన్న తమకు కనీసం తినేందుకు కూడా ఇబ్బంది ఉందని… ఇలాంటి సమయంలో మరోసారి బడులు మూసేస్తే ఎలా బ్రతికేదని మండిపడుతున్నారు. కరోనా పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు.
విద్యాసంస్థలతో కరోనా వ్యాప్తి చెందుతుందని మూసేశారు… మరీ బార్లు, వైన్సులతో కరోనా వ్యాపించటం లేదా అంటూ ప్రైవేటు టీచర్లు మండిపడుతతున్నారు. విద్యాసంస్థలు అయినా తెరవాలి లేదంటే తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జనగాం, సూర్యాపేట… ఇలా తెలంగాణలో ప్రైవేటు సంస్థలు, టీచర్లు ధర్నాలకు దిగుతున్నారు. ఈ నిరసనలు క్రమంగా రాష్ట్రం మొత్తం జరుగుతాయని, ఈ పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మండిపడుతున్నారు.