బస్సు కెపాసిటీ 50 మంది.. కానీ.. ఎక్కింది120 మంది. షాకవ్వకండి ఇది నిజమే. నాగపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని పరిస్థితి ఇది. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడడం.. ప్రయాణికులపై చెయ్యి చేసుకోవడం.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు.
దారి మధ్యలో ఎక్కడా ఆపకపోవడంతో బస్సులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతుండడంతో క్షేమంగా హైదరాబాద్ చేరతామో లేదో అని భయపడిపోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు బస్సు నెంబర్ చెప్పలేదుగా.. PY05E1413.