ఒక కన్ను కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్. ఈ ముద్దుగుమ్మ నటించిన ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ప్రియా మాత్రం తెగ పాపులర్ అయ్యింది. కన్ను గీటిన వీడియోతో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది ఈ చిన్నది. ఈ మలయాళీ పిల్ల.. అదే క్రేజ్ కంటిన్యూ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. కెరీర్ పరంగా చెప్పుకోదగిన జర్నీ సాగించకపోయినా సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది.
ఒరు అదార్ లవ్ తర్వాత కూడా ప్రియా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. బికినీ లుక్‌తో పాటు ట్రెండీ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో అట్రాక్టివ్ లుక్ పోస్ట్ చేసింది. ఒంటిపై టాటూస్ కనిపించేలా అందాల విందు చేసింది. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పొదల్లో ఫోటో షూట్ చేసింది.
తన సోయగాల వేడితో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఈ ఫోటోలను స్వయంగా ఆమెనే షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడి గ్లామర్ డోస్ చూసి రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి.. సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా.. అదీ మెప్పించలేదు
ఇటీవల తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది ప్రియా. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు ఈ సినిమా బ్రేకులు వేసింది. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉన్న ప్రియా ప్రకాష్.. మంచి ఆఫర్స్ వస్తే కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి రెడీ అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇస్తోంది. సో.. చూడాలి మరి ఈ అందాల వడ్డన అమ్మడికి ఏ మేర ప్లస్ అవుతుందనేది!.