సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా అంటూ అదరగొట్టింది సమంత.
తన అందంతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కుర్రకారును ఆకట్టుకుంది. అయితే తాజాగా సమంత అందచందాలకు తన భర్త కూడా పడిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ ప్రియమణి. ఈ విషయాన్ని నా భర్తే నాకు చెప్పాడని తెలిపింది.
సమంత కెరీర్ లో ఇలాంటివి చేసి ఉండకపోవచ్చని… కానీ ఈ ఐటెమ్ సాంగ్ ను చాలా మంది డౌన్ లోడ్ చేసి ఇప్పటికే రీల్స్ ను కూడా తయారు చేసి ఉంటారని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
ఈ పాట నంబర్ వన్ పాటగా నిలిచిందని ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు దేవి శ్రీ ప్రసాద్ కు హ్యాట్సాఫ్ తెలిపారు. అంతే కాకుండా కొరియోగ్రఫీ చాలా అందంగా ఉందని చెప్పుకొచ్చారు హీరోయిన్ ప్రియమణి.