నాగార్జున, ఎన్టీఆర్, జగపతిబాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లకు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో నటిస్తోంది. మరోవైపు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో కూడా నటిస్తోంది.
ఈ నేపథ్యంలోనే మరింత స్పీడ్ పెంచేందుకు శరీరాకృతిని కూడా మార్చుకుంది. ఇదే విషయంపై స్పందిస్తూ కథ డిమాండ్ చేస్తే అందాల ఆరబోతకు కూడా సిద్ధమని ప్రకటించేసింది. అంతే కాకుండా హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మరి అందాల ఆరబోతకు సిద్ధమైన ప్రియమణికి అవకాశాలు పెరుగుతాయో లేదో చూడాలి.