ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది. నిక్ జోనాస్-ప్రియాంక దంపతులకు మాలతి మేరీ అనే కుమార్తే గత ఏడాది జన్మించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా వీరిద్దరూ ఈ పాపకు జన్మనిచ్చారు. అయితే ఇంత వరకు పాప ముఖాన్ని ప్రపంచానికి చూపించని ఈ దంపతులు ఎట్టకేలకు బహిర్గతపరిచారు. నిక్ జోనాస్ సోదరులు జోనాస్ బ్రదర్స్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ఆవిష్కరించిన ఓ కార్యక్రమానికి ప్రియాంక హాజరైంది.
ముందు వరుసలో కూర్చున్న ఈ బాలీవుడ్ బ్యూటీ తన కుమార్తే మాలతి మేరీని చూపించింది. తల్లి ఒడిలో కూర్చొని సందడి చేసిన ఈ పాప క్రీమ్ కలర్ దుస్తుల్లో అందమైన హెయిర్ బ్యాండ్ ధరించి చూపరులను ఆకర్షించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రియాంక షేర్ చేసేంది.నిన్ను చూసి గర్వపడుతున్నా ప్రియతమా! జోనాస్ బ్రదర్స్ మీకు అభినందనలు అంటూ ప్రియాంక ఈ వీడియోను షేర్ చేసింది. నిక్ జోనాస్ సహా తన ఇద్దరు సోదరులు వాక్ ఆఫ్ ఫేమ్ స్టేజ్‌పై కనువిందు చేశారు.
ఆడియెన్స్‌లో ప్రియాంక, ఆమె కూతురు మాలతి కూడా ఉన్నారు. నిక్ జోనాస్‌ను వేదికపై చూసిన వీరిద్దరూ కేరింతలు కొట్టడం వీడియోలో చూడవచ్చు. అనంతరం ప్రియాంక గురించి నిక్ మాట్లాడాడు.”అందమైన నా భార్యకు, ప్రశాంతంగా, క్రేజీగా ఉండే నిన్ను వివాహం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా గొప్ప బహుమతి. మాలతీ నీకు నేను తండ్రిగా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను. 15 ఏళ్లలో నేను ఇక్కడకు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది.” అని నిక్ తెలిపాడు.
సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ షేర్ చేసిన ఈ వీడియో నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. మొదటి సారి మాలతి మేరీ కెమెరాను ముందుకొచ్చిందని ఓ యూజర్ తెలపగా.. ఈ క్యూట్ బేబీని చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదని మరోకరు కామెంట్ చేశారు. మీ కూతురు అచ్చం తండ్రి నిక్ లాగానే ఉందని ఇంకో యూజర్ తెలిపాడు. తండ్రితో పోలికలు దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఎట్టకేలకు ప్రియాంక కుమార్తె మాలతి మేరీ ముఖాన్ని బయట ప్రపంచానికి పరిచయం చేశారని మరో యూజర్ స్పష్టం చేశాడు.
గతేడాది ప్రియాంక-నిక్ దంపతులు సరోగసి ద్వారా తమ కుమార్తె మేరీకి జన్మనిచ్చారు. ఇటీవలే కూతురుతో కలిసి వీరు లాస్ ఏంజిల్స్‌లో ఖరీదైన ఇంటికి మకాం మార్చారు. ఇప్పటి వరకు మాలతికి సంబంధించి చిన్న పాటి గ్లింప్స్ మినహా ఎప్పుడూ పూర్తి స్థాయిలో ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించలేదు ప్రియాంక. ఎప్పుడు ఆమె ముఖాన్ని ఎమోజీతో కవర్ చేసి షేర్ చేసేది. కానీ తాజాగా ఆమె ముఖాన్ని బయటకు చూపించింది.
Priyanka Chopra and Nick Jonas reveal their daughter Malti Marie's face for the first time and the internet can't keep calm! ❤️
Isn't she adorable? 🥺#PriyankaChopra #Mamaraazzi pic.twitter.com/3zVkx16I06
— Mamaraazzi (@mamaraazzi) January 31, 2023