హాస్య నటుడు హసన్ మిన్హాజ్ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మలాలపై ఎగతాళి చేయడం కలకలం రేపింది. ప్రపంచ వ్యాప్తంగా మలాలకు మద్దతు పెరుగుతోంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో తాను అలా ఎగతాళి చేయడం తప్పేనంటూ పేర్కొన్నారు హసన్.
ఇదిలా ఉంటే మలాలాకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఆమె పలు అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మలాలకు మద్దతు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ప్రపంచం ఎంతగా మారినా పురుషుల భావజాలంలో ఎలాంటి మార్పు రాలేదని ఇది పూర్తిగా ప్రతి ఒక్కరు నిరసించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఇన్ స్టా గ్రామ్ లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గురించి నేను జోక్ చేశాను.
ఆమె ఇన్ స్టాలో నన్ను అనుసరిస్తుందని నేను ఆమెను తిరిగి అనుసరించనని చెప్పానంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా హసన్ మిన్హాజ్ ఇన్ స్టా ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.