బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రియాంక నిక్ ను వివాహం చేసుకొని జీవితాన్ని తాపీగా కొనసాగిస్తోంది. కాగా ఈ ఇద్దరూ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాము సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చామంటూ ప్రకటించారు.
ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2018 లో ప్రియాంక, నిక్ లు వివాహం చేసుకున్నారు. అయితే బిడ్డకు జన్మనిచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని కుటుంబంపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని తెలిపింది.
ఈ ప్రత్యేక సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేసింది ప్రియాంక చోప్రా.