బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ,తన భర్త నిక్ జోనాస్ తో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె పంచుకుంటారు.
తాజాగా తన భర్త నిక్ జోనాస్ ఒక సంగీత కచేరీ కోసం వెగాస్‌కు బయలుదేరినప్పుడు, ప్రియాంక చోప్రా అతనికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ను చూసి నిక్ తెగ సంతోషపడిపోయాడు.
దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలను నిక్ షేర్ చేశాడు. అందులో ఓ హోటల్ గది కనిపిస్తోంది. ఆ హోటల్ రూమ్ లో ఓ టేబుల్ ను బెలూన్లతో అందంగా డెకరేట్ చేసి వుంది.
ఆ పక్కనే వైట్ బోర్డు మీద ప్రియాంక తన చేతి రాతతో రాసిన ఓ మెసేజ్ కనిపిస్తోంది. అందులో ‘ వేగాస్ రెసిడెన్సీ బేబీ క్రష్ ఇట్.. నేను అక్కడ ఉండాలనుకున్నాను. నీ ప్రీ.. అనే సందేశం ఉంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.