ఢిల్లీ: రేవంత్‌రెడ్డిని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సారధిగా నియమించాలని నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల్ని ప్రియాంక గాంధీకి అప్పగించాలని యోచిస్తున్నారు. తన కుమార్తెను యూపీ మొత్తానికి ఇన్‌చార్జిని చేసేందుకు కసరత్తు జరుగుతోందని, ప్రియాంక చేపట్టబోయే కొత్త పాత్రపై త్వరలోనే పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ప్రస్తుతం తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో పూర్తి జవసత్వాలు తీసుకు వచ్చి 2022 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ రాష్ట్రంలో అధికారానికి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రియాంకాగాంధీకి కీలక బాధ్యతలు అప్పగించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.