ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. వివిధ దేశాల అధిపతులతో సమావేశం కాబోతున్నారు. అయితే, ప్రధాని పర్యటన సందర్భంగా ఫ్లైట్ లో వెళ్తున్న సమయంలోనూ ఫైల్స్ తిరగేస్తూ బిజీబిజీగా కనిపించారు. ఆ ఫోటోను బీజేపీ సోషల్ మీడియాలో హైలెట్ చేస్తుంది.
గతంలో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రీ ఫ్లైట్ లో ఫైల్స్ తో కుస్తీ పడుతున్న ఫోటోను ప్రధాని మోడీ ఫోటోను పోల్చారు. తాజాగా దీనికి కౌంటర్ గా ప్రియాంక గాంధీ రాజీవ్ గాంధీ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో రాజీవ్ ఫ్లైట్ లో ల్యాప్ ట్యాప్ లో బిజీగా పనిచేసుకుంటున్నారు. ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనం కూడా పక్కనే ఉన్నా పనిలో నిమగ్నమయ్యారు.
Advertisements
దీంతో ఈ దేశంలో ఐటీకి పునాదులు వేసింది రాజీవ్ అని చెప్పటంతో పాటు ఇతర ప్రధానులు కూడా గతంలో ఇంతకన్నా బాగా పనిచేశారని చెప్పటమే ఉద్దేశం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.