కేంద్రంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీని నమ్ముకుంటే ప్రజలను నట్టేట ముంచిందన్నారు. అందుకే ఇక మీదటైనా బీజేపీని నమ్మవద్దంటూ ఆమె సూచించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడుతూ… రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్‌లు ఇచ్చేందుకు కేంద్రం దగ్గర డబ్బలు లేకపోయినా, బడా వ్యాపారులకు మాత్రం కోట్లల్లో రుణమాఫీలను చేస్తోందని ఫైర్ అయ్యారు.
దేశంలోని యువత, ఉద్యోగులు, మహిళల కోసం బీజేపీ సర్కార్ చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియామకాలను చేపట్టకపోవడంతో గత ఐదేండ్లలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
ఈసారి తమ పార్టీని గెలిపిస్తే మొదటి కేబినెట్ సమావేశంలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆమె హామినిచ్చారు. అందులో మొదటిది హామీ… లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అని,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం రెండోదన్నారు.