కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఖండించారు. పోలీసుల ప్రవర్తనతో తాను తీవ్రంగా కలత చెందానంటూ సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆమె గొంతుపై ఒక పోలీస్ అధికారిని చెయ్యి వేయగా.. మరొకరు ఆమెను కిందకు తోసేశారు. దీంతో ప్రియాంక కిందపడిపోయింది. అయినా చెక్కుచెదరని అంకితభావంతో.. మాజీ ఐపీఎస్ ఎస్ఆర్ దారాపురి కుటుంబాన్ని పరామర్శించేందుకు టూవీలర్‌పై ముందుకు వెళ్లారు. ప్రియాంకా.. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లాలన్న నీ తపన.. బాధితులపట్ల నువ్వు చూపుతున్న సానుభూతికి గర్వంగా ఉంది. నువ్వు చేసిన దానిలో తప్పేమీ లేదు. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లడం నేరం కాదు’’ అంటూ వాద్రా ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో లక్నోలో జరిగిన సంఘటన తాలూకూ వీడియోను పోస్ట్ చేశారు