కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలతో కూడిన నాయకత్వం కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే వుంది. నానమ్మకు తగ్గ వారసురాలు ప్రియాంకను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకుంటోంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక మినహా మరెవ్వరూ లేరని వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా వున్న కాంగ్రెస్ సీనియర్లు సోనియా ముందు చాలా క్లియర్‌గా చెప్పేశారట!

ఈ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో పాటు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా సమావేశానికి హాజరైనట్టు సమాచారం. ఈ రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు వ్యూహరచనపై చర్చించారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని, మంచి పరిపాలన ద్వారా ప్రజల అభిమానం చూరగొనాలని సోనియా సూచించారు. పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఒకరు సమావేశంలో మాట్లాడుతూ రాహుల్, ప్రియాంకా గాంధీల్లో ఎవరైనా ఒకరు సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ బాధ్యతలు స్వీకరించకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టమని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.