ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి నేటితో 45 రోజులు అవుతోంది. ప్రపంచ దేశాలు రష్యాపై తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని నగరాలు శిథిలమయ్యాయి. అయితే, రష్యా దురాక్రమణ నేపథ్యంలో శరణార్థుల పరిస్థితిపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. యూనిసెఫ్ సౌహార్ద్ర రాయబారి హోదాలో ఆమె అంతర్జాతీయ నేతలకు పిలుపునిచ్చారు.
ప్రపంచ నేతల రా రండి ఉక్రెయిన్ ని ఆదుకుందాం అంటూ ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల వల్ల అత్యంత దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని, లక్షల మంది శరణార్థులు, చిన్నారులిపై చలించిపోయిన ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో పిల్లలు చెల్లాచెదురు అవుతున్నారని, ఉక్రెయిన్ శరణార్ధులను ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.
‘ప్రపంచ నాయకులారా.. మనం ఇక ఎంత మాత్రం చూస్తూ ఊరుకోలేము. శరణార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తారా’ అంటూ ప్రియాంక చోప్రా వీడియో తీసి షేర్ చేశారు. ఈ మేరకు ప్రపంచ స్థాయిలో విరాళాల కోసం అభ్యర్ధన చేశారు. అంతే కాదు స్పందించే దాతల కోసం యూనిసేఫ్ విరాళాల లింక్‌ను కూడా పొందుపరిచారు.
ఉక్రెయిన్ లో ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. రష్యా సేనల నుండి ప్రాణాలు కాపాడుకోవడం ఒక ఎత్తయితే, ఆకలి, నిత్యావసరాల లేమి, పొరుగుదేశాలకు వలస బాట, ఆపై శరణార్థుల సమస్యలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి.
World leaders, we need you to stand up for refugees around the WORLD to ensure that they get the support they need now.
We can’t just stand by and watch. it’s gone on too long! pic.twitter.com/dLYeDnhb5Z
— PRIYANKA (@priyankachopra) April 9, 2022
Advertisements