ఎంఐఎమ్ చీఫ్ అసదుద్దిన్ ఓవైసీ పర్యటన సందర్భంగా జార్ఖండ్ ఎయిర్ పోర్టులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మందార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్బంగా ప్రచారానికి ఓవైసీ జార్ఖండ్ వెళ్లారు. ఆదివారం ఎయిర్ పోర్టుకు చేరుకోగానే పాక్ అనకూల నినాదాలను కొందరు చేశారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఇది ఫేక్ వీడియోనా లేదా ఇందులో వాస్తవమెంత అనే విషయంపై దర్యా్ప్తు జరిపేందుకు జిల్లా మెజిస్ట్రేట్, స్థానిక డీఎస్పీతో ఓ కమిటీని నియమించినట్టు పోలీసులు తెలిపారు.
తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కొందరు చేసిన కుట్రగా దీన్ని ఏఐఎంఐఎమ్ జార్ఖండ్ అధ్యక్షుడు మహమ్మద్ అభివర్ణించారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ అలాంటి నినాదాలు చేయలేదని, ఎవరైనా చేసి వుంటే అలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన అన్నారు.