టాలీవుడ్ లో రియల్ స్టార్ శ్రీహరికి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసాడు ఆయన. ఆయన సతీమణి డిస్కో శాంతి కూడా వందల సినిమాల్లో నటించారు. శ్రీహరి నటించిన దేవా, సాంబయ్య, పోలీస్, భద్రాచలం వంటి సినిమాలతో తిరుగులేని విజయాలు సాధించారు. రియల్ స్టార్ ఇమేజ్ తో ఆయనకు మంచి ఆఫర్ లే వచ్చాయి.
Also Read:రాజమౌళి రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉంటుందా…?
హీరోగా ఫేడ్ అవుట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేసారు. వంద సినిమాలకు పైగా చేసిన ఆయన 1996 లో డిస్కో శాంతిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సౌత్ ఇండియా లో ఆమె టాప్ ఆర్టిస్ట్. ఐటెం సాంగ్స్ అంటే ఆమె పేరు ఇప్పటికీ గుర్తుకు వస్తుంది. స్టార్ కపుల్ గా వీళ్ళకు చాలా మంచి ఇమేజ్జ్ ఉంది. ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు విషయాలు పంచుకున్నారు.
శ్రీహరి మరణం తర్వాత తాను ఎన్ని కష్టాలు పడుతుంది వివరించారు. శ్రీహరి బ్రతికి ఉన్న సమయంలో ఎందరో ఆయన కోసం, ఆయన సహాయం కోసం వచ్చారట. శ్రీహరి పెద్ద కుమారుడు హీరోగా చేసినా సరే తమకు ఆర్ధిక కష్టాలు వదిలిపెట్టలేదని ఆమె చెప్పుకొచ్చారు. కోట్లు సంపాదించినా సరే అనేక సేవా కార్యక్రమాలతో శ్రీహరి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు తమ కుటుంబం చెన్నై లో నివాసం ఉంటుందని డిస్కో శాంతి పేర్కొన్నారు.
Also Read:స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఫుడ్ డెలివరి బాయ్..!