రంగారెడ్డి జిల్లాలో పింఛను రాక పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ పోస్ట్ ఆఫీస్ వద్ద పెన్షన్ దారులు క్యూ కట్టారు. పెన్షన్ డబ్బుల కోసం తిరిగే ఓపిక కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు, మూడు నెలల నుంచి పెన్షన్ రాక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ దారులు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక.. తమను పట్టించుకునే దిక్కులేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. పెన్షన్ కోసం లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెన్షన్ డబ్బుల కోసం రోజూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదంటున్నారు. గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదని పోస్ట్ ఆఫీసు అధికారులు తిప్పి పంపిస్తున్నారని పేర్కొంటున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అడుగుతున్నారు పెన్షన్ దారులు.
తమకు రావాల్సిన పెన్సన్ డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామంటున్నారు. అంతకుముందు ఫింగర్ ప్రింట్ పడలేదని ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టారన్నారు. మంగళవారం లోగా తమకు పెన్షన్ ఇవ్వకపోతే.. ఈనెల 9న జరగనున్న సీఎం మెట్రో ట్రైన్ రెండో దశ సభను అడ్డుకుంటామని పెన్షన్ దారులు హెచ్చరించారు పెన్షన్ దారులు.