సాధారణంగా మున్సిపల్ సమావేశాలంటే అధికార, విపక్ష నేతల మధ్య వార్ జరుగుతుంటుంది. అది చేయడం లేదు.. ఇది చేయడం లేదని ఒకరినొకరు తిట్టుకోవడం కామన్. అయితే.. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీన్ రివర్స్ అయింది. ఒకే పార్టీకి చెందిన నేతలు ఘర్షణకు దిగారు.
ఛైర్ పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం జరిగింది. అయితే.. వైసీపీ కౌన్సిలర్ల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం.. తోపులాట, చెప్పు దెబ్బల వరకు వెళ్లింది. అభివృద్ధి పనులపై 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ.. తన వార్డులో సవ్యంగా జరగడం లేదని అన్నారు.
ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు బాషా. దీనికి వైస్ ఛైర్మన్ మునిరెడ్డి సమాధానం ఇచ్చారు. అయినా కూడా బాషా వినలేదు. తన వార్డుపై ఎందుకంత కక్ష అంటూ నిలదీశారు. దీంతో పక్కనే ఉన్న మరో వైస్ ఛైర్మన్ ఖాజా మోహిద్దీన్ కలగజేసుకున్నారు.
బాషాకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు ఖాజా. కానీ.. వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. ఒకరిపై ఒకరు చెప్పులు విసిరేసుకుని దాడి చేసుకున్నారు.