టాలీవుడ్ లో బడా నిర్మాతల్లో అల్లుఅరవింద్ ఒకరు. ఆయన సినిమా నిర్మిస్తున్నారంటే కథ పట్ల నటీనటుల పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారన్నది అందరికీ తెలసిందే. అయితే తాజాగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా ప్రతిరోజు పండగే. సాయిధరమ్ తేజ్ హీరోగా రాశికన్నా కన్నా హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించింది.
అయితే ఈ సినిమా పై రిలీజ్ వరకు అల్లుఅరవింద్ కు ఎన్నో అనుమానాలు ఉండేవట. మారుతీ కథ చెప్తున్న సమయంలో ఈ పాయింట్ జనాలకు ఎక్కుతుందా అని మొదట అనుకున్నాడట. మారుతికి అదే విషయం చెప్తే కథ మరొకటి రాసుకొస్తాను అని చెప్పాడట. లేదు లేదు బాగానే ఉందంటూ సినిమా తియ్యటానికి సిద్ధం అయ్యాడట అల్లుఅరవింద్. ఆ తరువాత సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కాపీ చూసి చిత్ర యూనిట్ నవ్వుకున్నారట. కానీ అల్లు అరవింద్‌కు మాత్రం అప్పుడు కూడా జనాలు మనలని ఎంజాయ్ చేస్తారా అనే డౌట్ వచ్చిందట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అవన్నీ పటాపంచలయ్యాయని స్వయంగా చెప్పారు అల్లుఅరవింద్.