ఏపీలో సినిమా టికెట్ల వ్యవహార వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో రచ్చకెక్కుతుంది. ఇదే విషయంపై మోహన్ బాబు స్పందిస్తూ నిర్మాతలలో ఐక్యత లేదని ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. మోహన్ బాబు మాట్లాడిన వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది.
మోహన్ బాబు నిర్మాతలలో ఐక్యత లేదు అన్నారు. మీరు కూడా ఒక నిర్మాతే.. మీ కొడుకు విష్ణు కూడా ఒక నిర్మాతే.. మీ ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. మా వల్ల కాదు అనుకుంటే మీరు ముందు ఉండి ఈ సమస్యను పరిష్కరించండి. మీ వెనుకే మేము నిలబడతాము. నిర్మాతలందరిలో ఐక్యత లేదు అనడం సబబు కాదు అంటూ చెప్పుకొచ్చారు సి కళ్యాణ్.