టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా వైరస్ టైంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. నిడారంబరంగా జరిగిన పెళ్లి తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్న కరోనా ఇబ్బందులతో వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజు టాలీవుడ్ కోసం లావిష్ పార్టీ ఏర్పాటు చేయనున్నారు.

ఈనెల 18న దిల్ రాజు పుట్టిన రోజు. పైగా 50వ జన్మదినం కూడా కావటంతో… అన్నీ కలిసేలా బిగ్ పార్టీ అరెంజ్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుండి ప్రముఖులందరినీ ఈ పార్టీకి ఆహ్వనిస్తున్నారు. తన భార్యను ఈ పార్టీలోనే ప్రముఖులందరికీ పరిచయం చేయబోతున్నారు.
దాదాపు 6 సినిమాలు దిల్ రాజు చేతిలో ఉండగా… వకీల్ సాబ్ ముందుగా రిలీజ్ కానుంది.