ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన ఆమెతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె పేరు తేజస్విని కాగా పెళ్లి తర్వాత ఆమె పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతిష్యులు సూచించినందున తేజస్వినికి బదులుగా వైఘ్హ రెడ్డిగా మార్చినట్లు ప్రచారం సాగుతోంది.
ఇక దిల్ రాజు మొదటి భార్య 2017లో అనారోగ్యం చనిపోగా… ఆయనకు ఓ కూతురు ఉంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. దిల్ రాజు పెళ్లిపై స్పందించిన ఆయన కూతురు హన్షితా రెడ్డి తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టాగ్రాం వేదికగా… మీరు ఎల్లప్పుడూ నాకు బలం. మీరు కుటుంబ సభ్యుల సంతోషానికి ప్రాధాన్యం ఇచ్చారు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరు ఎల్లప్పుడూ, ప్రతి రోజు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా… మీ హన్షు అంటూ కామెంట్ చేశారు.