తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా…? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. కొంతకాలం క్రితం తన భార్య అనిత అనారోగ్యంతో మరణించటంతో దిల్ రాజు తన కూతురు ఇంట్లోనే ఉంటున్నాడు. దిల్‌రాజు ఏకైక కూతురు వివాహం కావటంతో ఆమె ఫ్యామిలీతోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.
అయితే, తాజాగా మరో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని దిల్ రాజు వివాహం చేసుకోబోతున్నారని.. ఫిలింనగర్‌లో చర్చ నడుస్తున్నా, దిల్‌రాజు తన వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా జాగ్రత్తపడతారన్న పేరుంది.