ఈ సంక్రాంతి పండుగ దిల్‌రాజుకు కాసుల వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి బరిలో ఉన్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలు కలెక్షన్ల పంట పండిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ఇక రజినీకాంత్ దర్భార్ మూవీ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిందే కావటం విశేషం.
కలెక్షన్ల రూపంలో సంక్రాంతికి మంచి లాభాలు తీసుకుంటున్న దిల్ రాజు పెద్ద హీరోల సినిమాలు కూడా కన్ఫామ్ అయ్యాయి. దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు సినిమాలు తెరకెక్కించబోతున్నారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి రెగ్యూలర్‌గా జరగబోతుంది.
ఇక అల్లు అర్జున్ కూడా దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి ఓకే చెప్పేశారు. మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ), ఓ మై ఫ్రెండ్ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలను అందించిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. అల వైకుంఠపురములో ఎంజాయ్ జోష్‌లో ఉన్న అల్లు అర్జున్… ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమా అనంతరం దిల్ రాజు సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Advertisements
ఇలా ఓవైపు తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు సూపర్ డూపర్ కలెక్షన్లతో దూసుకపోతుండగా… హిట్ కొట్టి మంచి హుషారు మీదున్న హీరోలతో కూడా సినిమాలు కన్ఫామ్ కావటం మరో విశేషం. ఇలా ఈ సంక్రాంతి పండుగ నిర్మాత దిల్ రాజుకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చిందంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.