ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహాం చేసుకున్నారు. కొంతకాలంగా వస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ దిల్ రాజు నిజామాబాద్ లోని తమ కుటుంబం కట్టించిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్ధరాత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాం చేసుకున్నారు. తెలుగులో మంచి సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు భార్య 2017లో అనారోగ్యంతో మరణించింది. దాంతో కొద్ది రోజులు కూతురు ఇంట్లో ఉన్న ఆయన, తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు.