సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటిస్తున్నారు.
నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు తో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ అనౌన్స్ చేశారు..కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
కానీ హిందీ లో రిలీజ్ అనే దానిపై మాత్రం ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాలీవుడ్ లో పవన్ క్రేజ్ ఏంటో ఈ సారి చూస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఈసారి భీమ్లా నాయక్ చిత్రం అక్కడ ఎలా ఉంటుందో చూడాలి.