ఇటీవల కాలంలో నిర్మాత నాగ వంశీ వరుస సినిమాలను చేస్తున్నాడు. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 12న సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించిన డిజే టిల్లు చిత్రం రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు నాగ వంశీ. భీమ్లా నాయక్ రిలీజ్ పై త్వరలో క్లారిటీ వస్తుందని… ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని చెప్పుకొచ్చారు.
ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయాలని ఉందని కోరిక బయట పెట్టారు.
ఇక భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల దృష్ట్యా రిలీజ్ వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.