తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్(78) చనిపోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
నారంగ్ టాలీవుడ్ లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారంగ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
నారంగ్ కు ఏషియన్ సంస్థల అధినేతగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఫైనాన్షియర్ గా ఇండస్ట్రీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉంది. పలు విజయవంతమైన సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ‘ఘోస్ట్’ చిత్రంతోపాటు తమిళ నటుడు ధనుష్ తో మూవీని నిర్మిస్తున్నారు. ఇంతలోనే ఆయన అనారోగ్యంతో చనిపోయారు.