సాయి తేజ్ యాక్సిడెంట్ పై ‘మా’ అధ్యక్షుడు నరేష్ చేసిన కామెంట్స్ ఈ సమయంలో కరెక్ట్ కాదన్నాడు నిర్మాత నట్టి కుమార్. తేజ్ మామూలు డ్రెస్ లోనే ఉన్నాడన్న ఆయన.. నరేష్ మాట్లాడింది తనకు నచ్చలేదని చెప్పాడు. అయినా.. ఈ సమయంలో రాజకీయాలు అవసరమా..? అని ప్రశ్నించాడు.
సాయి తేజ్ తన ఇంటి నుంచి బయలు దేరినట్లు నరేష్ తెలిపాడు. దానిపై నట్టి కుమార్ అభ్యంతరం తెలిపాడు. ఆయన చెప్పేది తప్పుగా అనిపిస్తోందని అన్నాడు. పైగా ఆ సమయంలో రేసింగ్ చేయడం లేదని వివరించాడు. తేజ్ తక్కువ స్పీడ్ లోనే వెళ్తున్నాడని.. రోడ్డుపై ఇసుక, మట్టి ఉండడం వల్లే బైక్ స్కిడ్ అయిందని చెప్పాడు నట్టి.
ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికల హీట్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఉంటోంది. నరేష్ మంచు విష్ణుకు సపోర్ట్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన తేజ్ యాక్సిడెంట్ పై స్పందిస్తూ.. రేసింగ్ గురించి మాట్లాడడాన్ని తప్పుబట్టాడు నట్టి కుమార్.