అవును ! ఇది కొత్త మూవీ టైటిల్ కాదు. ఇది నిజంగా దీక్ష. హైదరాబాద్ షేక్ పేట ఓయూ కాలనీలో రోడ్డు వేయడంలో ఆలస్యానికి నిరసన ఇది. అదే వీధిలో ఉండే సినీ నిర్మాత పరుచూరి శివరామ ప్రసాద్ రాత్రి నుంచి మధ్యాహ్నం దాకా నిరసన దీక్ష చేపట్టారు.
వర్షం కురిస్తే ఆ రోడ్డు అంతా మోకాలి లోతు నీళ్లు నిలుస్తాయి. ప్రజల విన్నపాలు విని సీసీ రోడ్డు వేయడానికి జి.హెచ్.ఎం.సి. అధికారులు కంకర కుప్పలు తోలి వదిలేశారు. దీంతో జనం బాధపడుతున్నారు. సదరు నిర్మాత పరుచూరి శివరామ ప్రసాద్ జారి పడి గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా దీక్షకు దిగారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని రోడ్డు పనులు మొదలెట్టడంతో దీక్ష విరమించారు. అచ్చం సినిమా సీన్ మాదిరిగానే ఉన్నా ప్రొడ్యూసర్ దీక్ష మాంచి రిజల్ట్ తెచ్చింది.