హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వద్ద మేనేజర్‌గా పని చేసే భాను ప్రకాష్ అదృశ్యమయ్యాడు. ఆఫీసుకు వెళ్లిన తన భార్త ఇంటికి తిరిగిరాలేందంటూ భానుప్రకాష్ భార్య ఉషారాణి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అయితే పీవీపీ ఆఫీసులో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బు కనిపించకుండాపోయిందని, దాని గురించి విచారించేందుకు భాను ప్రకాష్‌ను పీవీపీ అనుచరులు విజయవాడ తీసుకెళ్లినట్లు సమాచారం. పీవీపీ అనుచరులు బలవంతంగా భానుప్రకాష్‌ను నిర్భందించినట్లు తెలుస్తోంది. భానుప్రకాష్ భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో పీవీపీ మనుషులు భయపడి భానుప్రకాష్‌ను వదిలేసినట్లు తెలుస్తోంది.