చిటికేస్తే అన్నీ కాళ్ళ దగ్గరకే వస్తాయి. కానీ ఆయన కారు దిగివచ్చాడు.గాడితప్పిన ట్రాఫిక్ సరిచెయ్యాలి.. అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రాఫిక్ పోలీసయ్యాడు. అవును ! ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు ట్రాఫిక్ పోలీసుగా మారిపోయాడు. ఇది సినిమా కోసం వేసిన సీను కాదు. నిజజీవితంలో సిచ్యుయేషన్ డిమాండ్ చేసిన సీన్.
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రద్దీ సమయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంటడంతో కారు పక్కన పార్కుచేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేసారు సురేశ్ బాబు.జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
అడ్డదిడ్డంగా వచ్చిన వాహనదారులను ఆయన కంట్రోల్ చేస్తూ అందులో కనిపించారు. ఆయనకు సాయంగా ఒకరిద్దురు సామాన్యులు కూడా జతకలిసారు.ఇంకేముంది కొద్దినిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ దారికొచ్చింది. సురేశ్ బాబు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సురేశ్ బాబు బడ్జెట్ కంట్రోల్ చేయడం కాదు, ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయగలడని నిరూపించాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీ అయికూడా సమాజాన్ని,తోటి మనుషుల్ని కార్లో కూర్చుని తిట్టుకోకుండా కంట్రోల్ చేయడం గొప్పవిషయమని కామెంట్ల వర్షం కురింపించారు.
ఇక సినిమాల విషయానికొస్తే ..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గత కొంతకాలంగా ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. 2023లో తమ బ్యానర్ నుంచి పెద్దచిత్రాలతో పాటు, పలు చిన్న సినిమాలు కూడా వస్తాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సురేశ్ బాబు.