ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొరియన్ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. కొత్త కథలు కావటంతో ఆ సినిమాలైతే తెలుగు ప్రేక్షకులకు సరిపోతాయని భావిస్తున్నట్లు కనపడుతోంది. ఓ మై బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సురేష్ బాబు… ఇప్పుడదే దారిలో మరో కొరియన్ సినిమా రైట్స్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఓ మై బేబీ సినిమా కూడా కొరియన్ రీమేక్ కావటం విశేషం.
ఓ మై బేబీ సహ నిర్మాత సునితా తాటితో కలిసి మరో కొరియన్ సినిమా రీమేక్ చేయబోతున్నారు సురేష్ బాబు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్‌తో నడిచే ఆ సినిమాను తెలుగులో తీసుకురాబోతుండగా… ఓ చిన్న చేంజ్ అయితే చేశారని తెలుస్తోంది. ఇద్దరు పోలీసు అధికారుల స్థానంలో హీరోలకు బదులు హీరోయిన్స్‌ను పెట్టి సినిమా తీయబోతున్నారట. రెజీనాతో పాటు నివేధా థామస్‌లు పోలీస్ ఆఫీసర్స్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉంది.