ప్రముఖ నిర్మాత సురేష్ బాబు… ఇతర నిర్మాతల మాదిరిగా ఓటీటీ ప్లాట్ ఫాం రెడీ చేయకుండా, యూట్యూబ్ ఛానల్ పై పెట్టుబడి పెట్టారు. సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి సూచనతో డిఫరెంట్ గా వెళ్లాలని భావించారు. భారీ మొత్తం వెచ్చించినప్పటికీ… వచ్చే రెవెన్యూను బట్టి చూస్తే చాలా తేడా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఫైనల్ గా బయటకు వచ్చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఛానల్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా ఓ ్ అంతర్జాతీయ సంస్థకు అమ్మేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే, ఇది ఎంతకు అమ్ముడవుతుంది…? ఎంత లాస్ తో రానా టీం క్లోజ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.