ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ వస్తున్న సంగతి తెలిసిందే. ఏ అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. స్టార్ హీరోలు చేసే సినిమాలు షాక్ ఇస్తున్నా చిన్న సినిమాలు మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అటు ఓటీటీలో కూడా వీటికి మంచి ఆదరణ లభించడంతో స్టార్ నిర్మాతలు సైతం వాటి విషయంలో కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.
భారీ సినిమాలు చేసే సురేష్ బాబు, నాగ వంశీ, అల్లు అరవింద్ వంటి నిర్మాతలు ఈ సినిమాలకు కాస్త పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యదేవర నాగ వంశీ నిర్మాణ సారధ్యంలో అలాగే దర్శకుడు త్రివిక్రమ్ భార్య కలిసి నిర్మించిన బుట్ట బొమ్మ అనే చిన్న సినిమా వచ్చింది. ఈ సినిమాను పెద్ద సంస్థ నిర్మించడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాస్తవానికి సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
దీనిపై తాజాగా సూర్యదేవర నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమాని రిలీజ్ కి ముందే త్రివిక్రమ్ కి చూపించామన్నారు. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన ముందే చెప్పారని వెల్లడించారు. తాము అనుకున్నట్లే సినిమా రిజల్ట్ వచ్చిందని తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నానీతో ఒక సినిమా చేసే అవకాశం ఉంది.