సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్స్ కోసం నిర్మాతలు ఒక్కోసారి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నారా..? అతనో పెద్ద నిర్మాత. తన కొడుకు కూడా ఫెమస్ హీరోగా ఎదగాలని అనుకున్నాడు. స్టార్ హీరోగా పేరు ప్రశంసలు పొందాలని ఆయన కోరిక. అందుకే ఆ నిర్మాత తన కొడుకు కథానాయకుడిగా నటించే సినిమాలో స్టార్ హీరోయిన్స్ నే తీసుకొస్తాడు. ఒక్కోసారి హీరోయిన్స్ అంగీకరించకపోతే తనకున్న ఆస్తులను సదరు హీరోయిన్స్ పేరిట రాసిచ్చారని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపించింది.
Advertisements
ఇదిలా ఉండగా.. తన కొడుకు హీరోగా నటించే ప్రతి సినిమాలో స్టార్ హీరోయిన్ నటించాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఆ హీరో చేసిన సినిమాలు దాదాపు అన్ని ఫెయిల్యూర్స్‌గానే నిలిచాయి. అయితే ఎప్పటికైనా తన కొడుకు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోగా నిలుస్తాడని భావించి ఆ బడా నిర్మాత తన ఆస్తులను కరిగించుకుంటున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.