2017లో సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిన చిత్రం పీఎస్వీ గరుడవేగ.ప్లాపులతో సతమతం అవుతున్న హీరో రాజశేఖర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. అయితే.. తాజాగా ఈ మూవీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గరుడవేగ సినిమా నిర్మించిన జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వర రాజు,మేనేజింగ్ డైరెక్టర్ హేమ,జీవితా రాజశేఖర్ పై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించిన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.
కోటేశ్వర రాజు కథనం ప్రకారం..‘‘గరుడ వేగ సినిమా నిర్మాణం సమయంలో జీవితా రాజశేఖర్ కు రూ.26 కోట్లు అప్పుఇచ్చారు. దాని కోసం వారిద్దరు ఆస్తి డాక్యుమెంట్లు తనఖా పెట్టారు. అయితే..తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మారు. అటు జీవితా రాజశేఖర్ రూ.26 కోట్లు ఎగ్గొట్టారు.ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టాం..జీవితా రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది.
రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమయంలో మేము గరుడవేగ తీశాం.రాజశేఖర్ తమ ఆస్తులను మా వద్ద తాకట్టు పెట్టి 26 కోట్లు తీసుకున్నారు.మా వద్ద ప్రాపర్టీ పెట్టి మమ్మల్నిమోసం చేశారు. తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.సినిమాకు మేము డబ్బు పెడితే సంజయ్ రామ్ కు మా సినిమాను అమ్మేశాడు.త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడు.జీవిత చాలా డేంజర్ మనస్తత్వం కలిగిన మనిషి. అవకాశం కోసం వారిద్దరూ మమ్మల్నివాడుకున్నారు.మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి’’ అని కోటేశ్వర రాజు చెబుతున్నారు.
మరోవైపు ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని జీవిత తెలిపారు.శనివారం నిర్వహించే శేఖర్ మూవీ ప్రెస్ మీట్ లో పూర్తి ఆధారాలతో మాట్లాడతానని అన్నారు.