తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార. తన నటనతో అందంతో ఇట్టే ప్రేక్షకులను కట్టిపడేసే నయనతారకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అంతే కాదు నయన మీద నిర్మాతల ఫిర్యాదులు కూడా ఎన్నో ఉన్నాయి. నయన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదని, షూటింగ్ కు ఇచ్చిన డేట్ లలో కాకుండా ఇంకో డేట్ లో పిలిస్తే అదనంగా పారితోషకం తీసుకుంటుందట. మరో వైపు తన స్టాప్ కు అయ్యే ఖర్చు కూడా నిర్మాతలపైనే మోపుతుందట.
తాను షూటింగ్ వెళ్ళినపుడు కార్ దిగిన సమయం నుంచి కార్ వ్యాన్ వరకు మొత్తం భారం నిర్మాతలపైనే పడేస్తుందట. పర్సనల్ మేకప్ మన్ కు కూడా నిర్మాత నుండి డబ్బులు ఇప్పిస్తుందనే విమర్శలు గతం నుంచే నయనతార ఎదుర్కొంటుంది . తాజాగా ఈ విషయమై తమిళ నిర్మాతల మండలి వద్ద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.నయనతార తో పాటు ఇకపై హీరోలు హీరోయిన్స్ తమ వ్యక్తిగత స్టాప్ ఖర్చును నిర్మాతలపై మోపకూడదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మండలి హెచ్చరికలతో నయనతార పారితోషికం, ఆమె స్టాప్ పేమెంట్స్ విషయం లో వెనక్కు తగ్గాల్సిందే అంటున్నారు.