ముఖ్యమంత్రి మేలుకో – ప్రజల ప్రాణాలు కాపాడు – బతుకుదెరువు నిలబెట్టు అనే నినాదంతో ఈనెల 7వ తేదీన ప్రగతి భవన్ ముందు నల్ల బెలూన్ల తో నిరసన చేపట్టాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు , ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు . ఈ నిరసన కార్యక్రమంలో వివిధ పార్టీలు , ప్రజా సంఘాలు పాల్గొంటాయని కోదండరాం తొలివెలుగు ఇంటర్వ్యూలో చెప్పారు. అన్ని పక్షాలతో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు . ఫామ్ హౌస్ , ప్రగతి భవన్ లో నిద్రపోతున్న కెసిఆర్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని మండిపడ్డారు .