రైతు వేదిక కోసం 13 గుంటల భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకొని , కుటుంబాన్ని రోడ్డున పడేసిందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువ రైతు బేగరి నర్సింహులు కుటుంబాన్ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు .కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లోని వర్గల్ గ్రామంలో కోదండరాం పర్యటించారు . వస్తావా పరిస్థితులేంటో స్థానికులను ,నర్సింహులు కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు .
ఆ విషయాలు తొలివెలుగుతో పంచుకున్నారు కోదండరాం . మానసికంగా హింసించి నర్సింహులు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పింది ప్రభుత్వ అధికారులే అన్నారు కోదండరాం. కనీసం అంత్యక్రియలకు భార్యను వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు . రాత్రి 11 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు చేసారని , ఇది పూర్తిగా ప్రభుత్వ హత్య అన్నారు కోదండరాం .