ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన్న విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. మావోలతో సంబంధాలు వున్నాయన్న కేసులో ఆయన్ని విడుదల చేయలంటూ బాంబే హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఆ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు రద్దు చేసింది. ఈ కేసులో ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు ఇతర వ్యక్తుల విడుదలను సుప్రీం నిలిపివేసింది.
డిసెంబర్ 8న మరోసారి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, బెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును క్రిమినల్ ప్రొసిజర్‌లోని 390 కోడ్ ప్రకారం వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీం ధర్మాసం వెల్లడించింది.
మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అత్యంత కఠినమైన ఉపా చట్టం కింద ఆయనపై అభియోగాలు మోపడంతో ఆయనకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది.